యువ సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్ధన్బాబు(50) భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మంగళవారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సినీ హీరో తనీష్ తండ్రి ఏసు వర్థన్బాబు, భార్య సరస్వతి, కుమారులు తనీష్, వంశీకృష్ణ, కాశీవిశ్వనాథ్తో కలసి రాయదుర్గంలోని వెస్ట్రన్ ప్లాజాలోని ఏ బ్లాక్ ఫ్లాట్ నంబర్ 623లో నివాసం ఉంటున్నారు.
ఆర్మీలో సుబేదార్గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏసు వర్ధన్ కొడుకులతోనే ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 వరకు ఏసు వర్ధన్ ఫ్లాట్ బాల్కానీలో మద్యం సేవిస్తూ కూర్చున్నారు. బాల్కనీ నుంచి కేకలు వినిపించడంతో భార్య సరస్వతి వచ్చిచూడగా.. ఏసు వర్ధన్ అప్పటికే భవనంపై నుంచి కిందపడిపోయి ఉన్నారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.

Read For More News: visit Sakshi Online ePaper
No comments:
Post a Comment