అదృష్టమంటే రకుల్ప్రీత్సింగ్దే అంటున్నారు సినీ జనాలు. అనతికాలంలోనే అగ్ర కథానాయికల రేసులోకి దూసుకొచ్చిన ఈ పంజాబీ సొగసరి ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. తాజాగా ఆమెకు తెలుగులో మరో బంపర్ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా డాలీ (కిషోర్ పార్థసాని) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందని ఇటీవల వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం డేట్స్ సమస్యల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలిసింది. శృతిహాసన్ స్థానంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేశారని సమాచారం. పవన్‌కల్యాణ్ సరసన ఆమెకిది తొలి చిత్రం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలుగులో నాలుగు భారీ చిత్రాల్ని అంగీకరించిన రకుల్‌ప్రీత్‌సింగ్ డేట్స్ ఖాళీ లేకున్నా....పవన్‌కల్యాణ్ సరసన అవకాశం రావడంతో డేట్స్ సర్దుబాటు చేసుకుందని చెబుతున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్‌మరార్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment