కొందరి ప్రతిభ బతికున్న రోజుల్లో బయటపడదు. కానీ ఏదో ఒకరోజు వారు క్రీడలో సాధించిన అనితర సాధ్యమైన రికార్డులు వెలుగులోనికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటిదే పంజాబ్‌కు చెందిన మేటి అథ్లెట్ మఖాన్సింగ్ నేపథ్యం. భారత అథ్లెటిక్స్ రంగానికి పెద్దదిక్కు, అసాధారణ ప్రతిభకు నిలువుటద్దం, దిగ్గజ క్రీడాకారుడు ఫ్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్. వెంట్రుకవాసిలో ఒలింపిక్స్ పతకాన్ని చేజార్చుకున్న అథ్లెట్. జాతీయస్ధాయిలో అతని రికార్డులకైతే లెక్కేలేదు. ఇన్నాళ్లు స్ప్రింట్‌లో మిల్కాసింగ్‌ను మించినవాడు లేడనుకున్నాం. కానీ అదే రాష్ర్టానికి చెందిన మఖాన్సింగ్ దేశం గర్వించదగ్గ మేటి అథ్లెట్లలో ఒక్కడన్న విషయం అతను ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత తెలిసొచ్చింది. 1962 కోల్‌కతాలో జరిగిన జాతీయ క్రీడల్లో 400మీటర్ల రేసులో బరిలోకి దిగిన మఖాన్సింగ్.. మిల్కాను ఓడించిన మొనగాడిగా నిలిచాడు. అప్పటివరకు తనకు పోటీలేరనుకున్న మిల్కాకు తాను ఉన్నానంటూ సవాల్ విసిరిన స్ప్రింట్ కింగ్ మఖాన్సింగ్.
Read For More News: visit Namaste Telangana ePaper
No comments:
Post a Comment