Header Navigation

Tuesday, July 19, 2016

ప్రతినాయకుడిగా చేస్తా...

‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాల్లో పోలీస్ అధికారిగా శ్రీకాంత్ నటనను ప్రేక్షకులు మరచిపోలేరు. ఇప్పుడు మరోసారి ఆయన పోలీస్ అధికారిగా నటించిన చిత్రం ‘మెంటల్’. శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఎస్‌ఎన్‌వీ. ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘మొదట ఈ సినిమాకు ‘మెంటల్ పోలీస్’ టైటిల్ పెట్టాం. టైటిల్‌పై వివాదం కోర్టు వరకూ వెళ్లడంతో ‘మెంటల్’గా మార్చాం. రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా క్షమించని పాత్ర నాది.

పోలీసులంతా గర్వపడే సినిమా అవుతుంది. నెగిటివ్ రోల్స్‌లో చేయమని ప్రస్తుతానికి నన్నెవరూ అడగలేదు. భవిష్యత్తులో ఎవరైనా అలాంటి పాత్ర తీసుకొస్తే, అది నచ్చితే తప్పకుండా చేస్తా’’ అని చెప్పారు. ‘‘బతికినా, చచ్చినా పోలీస్‌గానే బతకాలనే పాత్రలో శ్రీకాంత్‌గారు కనిపిస్తారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రమిది. సెన్సార్ పనులు పూర్తయ్యాయి’’ అని బాబ్జీ పేర్కొన్నారు.

Read For More News: visit Sakshi Online Newspaper

No comments:

Post a Comment