అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను మన హైదరాబాదీ యువకుడు, ప్రముఖ మోడల్ రోహిత్ ఖండేల్వాల్ సొంతం చేసుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2016 ఫైనల్ పోటీలకు ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46మంది పోటీదారులను పక్కకు తోసేసి ప్రపంచ విజేత అయ్యాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రోహిత్ కావడం విశేషం. ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్ పట్టణంలో బుధవారం జరిగిన ఫైనల్స్‌లో రోహిత్ (26) మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను దక్కించుకున్నారు. బహుమతిగా 50వేల డాలర్లు (రూ.35లక్షలు) నగదు కూడా సొంతం చేసుకున్నారు. మిస్టర్ వరల్డ్‌గా నిర్వాహకులు ప్రకటించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ ప్రపంచ టైటిల్ దక్కిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ టైటిల్ సాధించిన మొదటి భారతీయుడిని కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నది. నా కల సాకారమైంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన, మార్గదర్శకం చేసిన మిస్ ఇండియా సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
Read For More News: visit Namaste Telangana Online ePaper
No comments:
Post a Comment