Header Navigation

Monday, July 25, 2016

అప్పటివరకూ కచ్చితంగా నటిస్తా! - వెంకటేశ్

"ఈ 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ‘మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్‌పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా’ అని మారుతిని అడిగా. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా’’ అని వెంకటేశ్ అన్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బాబు బంగారం’. నయనతార హీరోయిన్. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని డి.సురేశ్‌బాబుకి అందజేశారు.

అనంతరం దాసరి మాట్లాడుతూ - ‘‘బాబు బంగారమని నేను 30 ఏళ్ల క్రితమే చెప్పాను. తెలుగులో ఓ నిర్మాత కుమారుడు స్టార్ హీరోగా ఎదగడం, 30 ఏళ్లు పూర్తి చేసుకోవడమనేది ఒక్క వెంకటేశ్‌తోనే జరిగింది. రామానాయుడిగారి ఆశీస్సులతో ఏ ఒక్క నిర్మాతతో కూడా విమర్శలు లేకుండా మంచి పేరుతో వెంకటేశ్ ముప్ఫయ్యేళ్లు విజయవంతంగా కెరీర్ పూర్తి చేసుకున్నాడు. నిర్మాతల కష్టాలు తెల్సిన హీరో. కాశ్మీర్‌లో ‘బ్రహ్మపుత్రుడు’ షూటింగ్ చేస్తుంటే.. భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండలు ఎక్కాడు. క్రమశిక్షణ, విధేయత, సమయపాలన, ఆసక్తి, ఉత్సాహం, ప్రయత్నం.. అన్నీ కలిపితే వెంకటేశ్. అవే మనల్ని విజయంవైపు నడిపిస్తాయి. అతని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. కథను బట్టి నటించాడు తప్ప, సంస్థను బట్టి కాదు. కథ ప్రాధాన్యంగా సినిమాలు నిర్మించబడ్డాయంటే అవి వెంకటేశ్ సినిమాలే. ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు అందుకున్నదీ వెంకీనే. మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో గానీ, చాలా మంచి టైటిల్ పెట్టాడు.

Read For More News: visit Sakshi Online Newspaper