Header Navigation

Monday, August 1, 2016

తెలుగు రాష్ట్రాల్లో 38377 ఉపాధ్యాయ ఖాళీలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి సమర్పించిన నివేదికలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ వివరాలు వెల్లడించాయి.

తెలంగాణలో 16,193 టీచర్ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16,193 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో (1 నుంచి 8వ తరగతి వరకు) 13,049 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 3,144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో 35.79 శాతం స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరని వివరించింది.

Read For More News: visit Sakshi Online Newspaper
.