Header Navigation

Friday, August 5, 2016

హీరో'ఇన్'

ఇవాళ చాలా సినిమాల్లో హీరోలకు మించిన హీరో(యిన్) - ఈ బెంగుళూరు భామ. గ్లామర్ హీరోయిన్‌గా మొదలై ఆ పాత్రలే చేస్తూ వస్తున్న ఈ యోగా టీచర్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ ‘అరుంధతి’. ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాకు తెలుగులోనే కాదు... తమిళంలోని ఆడియన్స్ క్లాప్స్ పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిశాయి. అప్పటికే సౌందర్య మరణంతో కొత్త చిరునామా వెతుక్కుంటున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త కేరాఫ్ అడ్రస్ - అనుష్క అయ్యారు. అప్పటి నుంచి ‘పంచాక్షరి’, లేటెస్ట్ ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ దాకా కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందంటే, అనుష్క కాల్షీట్లకి యమ డిమాండ్!

రాబోయే చిత్రం: అశోక్ దర్శకత్వంలో తయారవుతున్న ‘భాగమతి’. పేరు చూడగానే ఇదేదో గోల్కొండ నవాబుల కాలం నాటి చారిత్రక కథ అనుకుంటే పొరపాటే! ఇది అచ్చమైన సోషల్ ఫిల్మ్. కథ అంతా హీరోయిన్ పాత్ర చుట్టూరానే తిరుగుతుందని దర్శక, రచయిత, ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ వివరించారు.

Read For More News: visit Sakshi Online Newspaper