Header Navigation

Monday, August 8, 2016

ఏడు దశాబ్దాలు వెనక్కి!

రానా.. రెజీనా.. అన్నీ సవ్యంగా కుదిరితే ఇప్పటికే ఈ జోడీని తెరపై చూసేవాళ్లం. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగింది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ జోడీ కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో సత్యశివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా, రెజీనా జంటగా నటించనున్నారు. తమిళ చిత్రానికి ‘మడై తిరందు’ తెలుగుకి ‘1945’ అనే టైటిల్‌ని ఖరారు చేశారట. 1940లలో జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారట.

‘బాహుబలి: ది కంక్లూజన్’లో భల్లాలదేవుడి పాత్ర కోసం రానా కండలు తిరిగిన దేహంతో పాటు గడ్డం కూడా బాగా పెంచారు. ‘1945’లో ఓ గెటప్ ఈ భల్లాలదేవుడి గెటప్ తరహాలో ఉంటుందట. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన కథతో సినిమా కాబట్టి రానా, రెజీనా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు.

Read For More News: visit Sakshi Newspaper